తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతం : యూడీఏఐడీ బృందం
యూడీఏఐడీ బృందం | తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది.

మెదక్ : తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్‌లోని అర్బన్ పార్కు, హవేళీఘనపూర్ మండల పరిధిలోని పోచారం అభయారణ్యం, వనవిజ్ఞాన కేంద్రాన్ని సోమవారం నలుగురు సభ్యులతో కూడిన యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం సందర్శంచింది.
ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, మొక్కల పెంపకం, హరితహారం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి స్థానిక అధికారులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు.
నర్సాపూర్ అర్బన్ పార్కులో పెరిగిన మొక్కలను చూసి బృందం ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. అర్బన్ పార్కు అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధ్దరణ పనులను తెలంగాణ ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్ , సీసీఎఫ్ శర్వానన్ ఫొటో స్టాల్ ద్వారా బృందానికి వివరించారు.
అనంతరం వాచ్‌టవర్ పైనుంచి ఫారెస్ట్ అందాలను చూసి మైమరచిపోయారు. అర్బన్ పార్కులో పండిన సీతాఫలాలను రుచిచూసి బాగున్నాయన్నారు. పోచారం అభయారణ్యం, వనవిజ్ఞాన కేంద్రం నిర్వహణ బాగుందని బృందం సభ్యులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో యూడీఏఐడీ డిఫ్యూటీ అసిస్టెంట్ అంజలీ కౌర్, మిషన్ డైరెక్టర్ ఇండియా వీణారెడ్డి, సీనియర్ ఫారెస్ట్ అడ్వైజర్ వర్గీస్ పాల్, ప్రోగ్రామ్ ఆఫీసర్ అలైన్ లీ ఉన్నారు. వారి వెంట సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ లోకేశ్ జైశ్వాల్, సీసీఎఫ్ శర్వానన్, డీఎఫ్‌వోలు రవి ప్రసాద్, జ్ఞానేశ్వర్, ఎఫ్ఆర్వోలు అంబర్‌సింగ్, మనోజ్‌కుమార్, ఫారెస్ట్ ఫ్లస్ 2.0 టీమ్ సభ్యులు మనోజ్ పట్నాయక్, సాయిలు, డిప్యూటీ రేంజర్ మనోజ్‌కుమార్, ఎఫ్‌డీవో ఫ్లయింగ్ స్వాడ్ జ్ఞానేశ్వర్, సిబ్బంది ప్రసాద్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

