హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రైల్వేలో భద్రతపై దృష్టిసారించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అన్ని జోన్ల భద్రతపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవ్‌కు సంబంధించిన వివరాలను ఆయన అడిగితెలుసుకున్నారు. ఏవైనా లోపాలు ఉంటే త్వరగా సరిదిద్దాలని సూచించారు. లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డులు, ట్రాక్ మెషిన్ ఆపరేటర్లు, టవర్ వ్యాగన్ ఆపరేటర్లు ఇతర భద్రతా సిబ్బందికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. రైళ్ల నిర్వహణలో భద్రతను నిర్ధారించడానికి సెఫ్టీ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ట్రాఫిక్ సౌకర్యాలు, ట్రాక్ పునరుద్ధరణ, డబ్లింగ్ పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాం దేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.