బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 12:38:00

తుంగభద్ర డ్యాంకు పోటెత్తిన వరద

తుంగభద్ర డ్యాంకు పోటెత్తిన వరద

  • ఇన్ ఫ్లో 1,01,002 క్యూసెక్కులు 
  • అవుట్ ఫ్లో 8,629 క్యూసెక్కులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ 54.521 టీఎంసీలు
  • పూర్తి నీటి మట్టం 1633 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం 1618.60 అడుగులు
  • తుంగ నది నుంచి 70,375 క్యూసెక్కుల వరద

జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. అల్పపీడన ద్రోనీ ప్రభావంతో ఎగువన  కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాం కు వరద ముంచెత్తుతోంది. శనివారం టీబీ డ్యాంకు 1,01,002  క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 8,629 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 54.521 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1618.60 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. తుంగ డ్యాం నుంచి 70,375 క్యూసెక్కుల వరద టీబీ డ్యాంకు చేరుతుండగా.. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


logo