హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తిరుపతి ఎయిర్పోర్ట్లో అలయెన్స్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసు రద్దుతో 48 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగా రు. హైదరాబాద్ నుంచి ఉదయం 7:15 గంటలకు తిరుపతికి వచ్చే విమానం, తిరిగి 8:15 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ప్యాసింజర్స్ ఉదయమే ఎయిర్పోర్ట్కు చేరుకోగా, విమాన సర్వీసు రద్దయిన విషయం తెలుసుకొని అధికారులను నిలదీశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు గంటలకుపైగా బైఠాయించారు. డబ్బులు తిరిగి చెల్లిస్తామనడంతో ప్రయాణికులు శాంతించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుంది.