Kothakota | కొత్తకోట వద్ద చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం
వనపర్తి జిల్లా కొత్తకోట (Kothakota) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట (Kothakota) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. బళ్లారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. చనిపోయినవారిని వాసి(1), బుస్రా (2), మరియా (4), ఫాతిమా (50), అబ్దుల్ రెహమాన్ (30)గా గుర్తించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదమని కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

