Minister Srinivas Yadav | 8వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం : మంత్రి తలసాని
Minister Srinivas Yadav | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
Minister Srinivas Yadav | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సచివాలయంలో గురువారం దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలుపై కరపత్రాల ద్వారా వివరించాలని సూచించారు. రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల యూనిట్లు పొందిన గొర్రెల పెంపకందారులు, ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వాహనాలు, ఉచిత చేప పిల్లల ద్వారా లబ్ధిదారులు అత్యధికంగా ఉన్నారని, ఉత్సవాల్లో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు.
ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణను రూపొందించి జిల్లా, మండల అధికారులకు పంపించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా డెయిరీ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 8న చెరువుల పండుగ సందర్భంగా ప్రధాన చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల ను నిర్వహించాలని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ ఇతర పథకాలపై ప్లేక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు, ఫొటో ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పశువైద్యశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేలుజాతి దూడల సంపద అభివృద్ధి కోసం కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది.
21 లక్షల కృత్రిమ గర్భధారణలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన నాణ్యమైన దూడల ప్రదర్శన నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. గోపాలమిత్రలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఇవే కాకుండా 21 రోజులపాటు ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో కూడా భాగస్వాములు కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

