మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట : ఎమ్మెల్యే ఆరూరి
Warangal | దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు
వరంగల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ చెరువులో ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అందిస్తున్న 1 లక్షా 35 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వదిలారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పంపిణీ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించిందని, చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

