హైదరాబాద్, నమస్తే తెలంగాణ;హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద సహాయక చర్యల్లో తెలంగాణ అగ్నిమాపకశాఖ
‘బాహుబలి’ని రంగంలోకి దించింది. బ్రాంటో స్కై లిఫ్ట్‌ను ఉపయోగించి 14 మంది ప్రాణాలు కాపాడింది. ఈ స్కై లిఫ్ట్‌తో 17 అంతస్తుల ఎత్తు వరకు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేయవచ్చు. ఈ బాహుబలి లేడర్తో భవనం అద్దాలు పగులగొట్టి మరీ ప్రజల ప్రాణాలను అగ్నిమాపకశాఖ అధికారులు కాపాడారు.