Kodangal Lift | కొడంగల్ లిఫ్ట్‌తో ఆర్థిక భారం.. భారీగా పెరిగిన ఎత్తిపోతల బడ్జెట్!
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృథా చేయబోము అంటూ ఒకవైపు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. అందుకు తాజాగా ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఎన్‌కేఎల్‌ఐఎస్) ఉదాహరణగా నిలుస్తున్నది.
- ప్రెషర్ మెయిన్స్‌తో 52 కోట్లు అదనం
- మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్స్ట్రా
- ఉద్ధండాపూర్ నుంచి ప్రతిపాదనలున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
- టన్నెల్ ఆలస్యమవుతుందని సాకులు
- పంప్‌హౌస్, ఎరక్షన్‌కు అదే సమ యం పడుతుందన్న అధికారులు
Kodangal Lift | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృథా చేయబోము అంటూ ఒకవైపు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. అందుకు తాజాగా ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఎన్‌కేఎల్‌ఐఎస్) ఉదాహరణగా నిలుస్తున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్రతిపాదనలున్నా, వాటిని పక్కనపెట్టి రూ.4,350 కోట్ల వ్యయంతో ఎన్కేఎల్ఐఎస్ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. తొలుత ప్రతిపాదించిన సొరంగ నిర్మాణాలను కాదని, ప్రెషర్ మెయిన్స్‌ను ప్రతిపాదించింది. దీంతో రూ.53 కోట్ల వ్యయం పెరుగుతుండగా, ఏటా మెయింటెనెన్స్ చార్జీలు అదనపు భారం కానున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఇంజినీర్లు, సాగునీటిరంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
3,117 కోట్ల నుంచి 4,350 కోట్లకు పెంపు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని రూ.లక్ష ఎకరాలకు సాగునీటితోపాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎన్‌కేఎల్‌ఐఎస్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు దశల్లో చేపట్టనున్న లిఫ్ట్ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నది.
మొదటి దశలో భూత్పూరు జలాశయం నుంచి ఊటూరు చెరువుకు, అకడి నుంచి జయమ్మ చెరువుకు, అకడి నుంచి కనుకుర్తి చెరువుకు లిఫ్ట్ చేయనున్నారు. మొదటి దశ పనులకు రూ.2,945 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. రెండో దశలో జాజాపూర్, దౌల్తాబాద్, బొమ్రాస్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హున్నాబాద్, కొడంగల్ చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మిస్తారు.
అందుకు రూ.1,404.50 కోట్లు వ్యయమవుతుందని అంచనావేశారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.4,350 కోట్లుగా నిర్ణయించారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సర్వేలు, డీపీఆర్ ప్రతిపాదనల ప్రకారం ఈ పథకానికి అయ్యే వ్యయం రూ.3,117 కోట్లుగా అంచనా వేసినా, ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను సవరించటం గమనార్హం.
ప్రెషర్ మెయిన్స్‌తో అదనంగా 52 కోట్లు
గతంలో ప్రతిపాదించిన భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో ప్రాజెక్టు వ్యయం రూ.60 కోట్లు పెరగనున్నది. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగాల ద్వారా తరలించాలి. దాదాపు 38 కిలోమీటర్ల పొడవు సొరంగాలను తవ్వాలి. భూగర్భ సొరంగాలకు బదులుగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ, జియోలాజికల్ అధ్యయనాలు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్లు, బండల కటింగ్‌కు ఎకువ సమయం పడుతుందని, అందుకే ప్రెషర్ మెయిన్స్ నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్తున్నది.
కానీ, ప్రభుత్వ వాదనలను ఇంజినీరింగ్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ప్రెషర్ మెయిన్స్‌తో ప్రాజెక్టును చేపట్టినా మూడేండ్లు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. మోటర్లు రావడానికి, పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటర్ల బిగింపునకు రెండున్నరేండ్లు పడుతుందని వివరిస్తున్నారు. సొరంగాల ద్వారా పంపింగ్ సిస్టమ్‌ను పూర్తిచేయడానికి రూ.963.89 కోట్లే అవసరం అయితే, ప్రెషర్ మెయిన్స్ ద్వారా రూ.1,016.57 కోట్లు అవుతుందని లెక్కలతో సహా తేటతెల్లం చేస్తున్నారు. అయినా, ప్రభుత్వం ప్రెషర్మెయిన్స్ను చేపడుతున్నదని ఇంజినీర్లు వివరిస్తున్నారు. అది కాంట్రాక్టర్లను బతికించడానికేనని విమర్శిస్తున్నారు.
‘పాలమూరు’లో ప్రతిపాదనలున్నా..
కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. మక్తల్ నియోజకవర్గంలో ఊటూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బొమ్రాస్పేట మండలాల్లో 53,745 ఎకరాలను ప్రతిపాదించారు.
దాంతోపాటు 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందించాలని నిర్ణయించారు. కానీ, ఆయా ప్రాంతాలకు ఇప్పటికే చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీరిచ్చేందుకు ప్రతిపాదలున్నాయి. కాల్వ తవ్వకానికి సైతం గత ప్రభుత్వం దాదాపు రూ.5,600 కోట్లు మంజూరు చేసింది.
ఉద్దండాపూర్ కెనాల్‌పై అదనంగా పలుచోట్ల చిన్న చిన్న లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని ఎత్తయిన ప్రాంతాలకు సైతం నీటిని అందించాలని నిర్ణయించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలన్నీ పక్కనపెట్టి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్‌ను చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు వృథా అవుతాయని ఇంజినీరింగ్ నిపుణులు వివరిస్తున్నారు. అదీగాక ఈ స్కీం వల్ల రాజీవ్‌భీమా ఆయకట్టుకు సైతం ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రతిపాదనలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

