Voter List | మీకు ఓటు హక్కు లేదా.. ? ఈ గుడ్న్యూస్ మీకోసమే
Voter List | ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది.
Voter List | ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించనున్నారు. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇదే జాబితాతో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. 2023 అక్టోబర్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదుకు చేసుకునేందుకు అవకాశం ఉంది.
518 మంది నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ
సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ)కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నియోజకవర్గ స్థాయి 518 మంది నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 34,891 బూత్లు ఉన్నాయి. వీటికి అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా 80 మంది జిల్లా స్థాయి మాస్టర్ ట్రెనర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు 518 మంది నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రెనర్లు శిక్షణ ఇచ్చారు. శిక్షణ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్వోలు, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు హాజరయ్యారు. త్వరలో మండల, మున్సిపాలిటీ స్థాయిలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

