జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని, గురుకులాల్లో స్పెషల్ కోటాలో సీట్లు ఇప్పించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని, గురుకులాల్లో స్పెషల్ కోటాలో సీట్లు ఇప్పించాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ వినతులపై బుర్రా సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బీ బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, బీ రాజశేఖర్, కార్యదర్శులు బీ జగదీశ్వర్, గండ్ర నవీన్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్, ఎం రమేశ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
మరికొన్ని వార్తలు చదవండి..
కాళేశ్వరంపై 58 అఫిడవిట్లు
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలం గాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీలు, ప్రజాసంఘాలు, రైతులు తాజాగా అఫిడవిట్లను దాఖలు చేశారు. ఇప్పటి వరకు 58 అఫిడవిట్లు దాఖలయ్యా యని అధికార వర్గాలు వెల్లడించాయి. అఫిడవిట్ల దాఖలుకు కమిషన్ విధించి న గడువు నేటితో ముగియనున్నది. మరిన్ని అఫిడవిట్లు దాఖలయ్యే అవకా శమున్నది. అఫిడవిట్లన్నింటినీ పరిశీ లించి, తదుపరి విచారణను కొనసాగిం చేందుకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ జూలై 5న రాష్ర్టానికి రానున్నారని సమాచారం.
కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్ పనుల తనిఖీ
హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): కాజీపేట బైపాస్ రైల్వే లైన్ నిర్మాణ పనులపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టి సారించారు. ఈ మేరకు పురోగతిలో ఉన్న పనులను గురువారం జోనల్ రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తనిఖీ చేశారు. ప్రణాళికల ప్రకారమే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాజీపేట బైపాస్ లైన్ 21.47 కిలోమీటర్ల వరకు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు రూ.125 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించినట్టు తెలిపారు. కాజీపేట, వరంగల్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులను కూడా ఆయన గురువారం పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

