రైతన్నల శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ 13 : రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకన్నారు.
3 సంవత్సరాలు నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడితే 30 సంవత్సరాల వరకు మన కుటుంబానికి ఉపాధి కల్పిస్తాయన్నారు. కోతుల బెడద, జంతువుల నుంచి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ మొక్కలకు అందిస్తూ సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఒక చెట్టుకు 12 నుంచి 18 గెలలు వస్తాయని, ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నర్సరీ అభివృద్ధికి కృషి చేసిన ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్టీవో రమేష్, తహసీల్దార్ రాఘవరెడ్డిని మంత్రి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ రెడ్డి, జీఎం సుధాకర్ రావు, జిల్లా కలెక్టర్ కే శశాంక, ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, కాకిరాల హరి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

