ఏఈవోల సస్పెన్షన్ ఎత్తివేయాలి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలోని పలువురు వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తొర్రూ రు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
- తొర్రూరులో రైతుల ధర్నా
తొర్రూరు, జూన్ 10 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలోని పలువురు వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తొర్రూ రు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. జీలుగ విత్తనాల అవినీతి బాగోతం నుంచి తప్పించుకునేందుకు ఏవో సోమకుమార్, ఏడీఏ కలిసి ఏఈవోలు జమున, దీపిక, అరవింద్‌ను సస్పెండ్ చేశారని విమర్శించారు.
జీలుగ విత్తనాల దందాలో ఎటువంటి ప్రమేయం లేని ఏఈవోలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఏవో కుమార్ జీలుగ విత్తనాలను పక రాష్ట్రాలకు అమ్ముకున్నారని, తనను తాను రక్షించుకునేందుకు ఏఈవోలను ఈ అవినీతిలోకి లాగినట్టు ఆరోపించారు. విచారణ అధికారిగా వచ్చిన ఏడీఏ కూడా అవినీతిలో భాగమయ్యాడని, రైతులను విచారించలేదని అన్నారు. విక్రయ కేంద్రాల యజమానులు ఏఈవోల పాత్ర లేదని చెప్పిన నివేదికను కూడా తారుమారు చేశారని మండిపడ్డారు. తక్షణమే విజిలెన్స్ అధికారులచే నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AEOs
- Farmers Protest
- thorrur
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

