నకిలీ పత్రాలతో రైతుబీమా కొట్టేశారు

- బతికున్న వ్యక్తికి డెత్‌సర్టిఫికెట్ సృష్టి
- రైతుబంధు కో-ఆర్డినేటర్ నిర్వాకం
- సాగుకు పెట్టుబడి సాయం అందకపోవడంతో వెలుగులోకి
వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/కులకచర్ల: ఓ మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి రైతుబీమా కొట్టేశారు. రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌కు చెందిన మహిళారైతు చంద్రమ్మకు 1.30 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నది. ఆమెకు క్రమంతప్పకుండా రైతుబంధు సాయం అందుతున్నది. గత రెండుపర్యాయాలు రైతుబంధు సొమ్ము ఆమె ఖాతాలో జమకాలేదు. రైతు బతికిఉండగానే చనిపోయినట్టుగా పత్రాలు తయారుచేసి రైతుబీమా పొందుతున్నారంటూ గ్రామానికి చెందిన ఒకమహిళ వ్యవసాయాధికారులకు ఫిర్యాదుచేసింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకివచ్చింది.
చంద్రమ్మ చనిపోయినట్టు నకిలీపత్రాలతో బీమాసొమ్ము పొందినట్టు తేలింది. 14-09-2020న చంద్రమ్మ మృతిచెందినట్టుగా రైతుబంధు గ్రామ కో-ఆర్డినేటర్ రాఘవేందర్‌రెడ్డి 30-09-2020న డెత్‌సర్టిఫికెట్ సృష్టించారు. జిరాక్స్షాపులో మరణధ్రువీకరణ పత్రం కొనుగోలుచేసి పంచాయతీ ముద్రలను నకిలీవి తయారుచేయించాడు. బీమా క్లెయిమ్‌కోసం పత్రాలు నింపి గ్రామంలో చనిపోయిన ముగ్గురు రైతుల క్లెయిమ్ ఫైళ్లతోపాటు అధికారులకు అందజేశాడు.
ఒకేసారి నాలుగు ఫైళ్లు రావడంతో వ్యవసాయాధికారులు విచారణ లేకుండానే వాటిని బీమాకోసంపంపించారు. బీమాపాలసీ నంబర్: 872649, పట్టాదారు పాసుపుస్తకం నంబర్ టి:07090160075కు సంబంధించి చంద్రమ్మ కొడుకు, నామినీ బాలయ్య ఖాతానంబర్ : 62311712754లో 2020 డిసెంబర్9న బీమా ైక్లెమ్ అయింది. వడ్ల డబ్బులు బాలయ్య ఖాతాలో పడ్డాయని నమ్మించి అతడి ఖాతా నుంచి రాఘవేందర్‌రెడ్డి పలుదఫాలుగా డబ్బులు తీసేసుకున్నాడు. రైతుబీమా డబ్బులు దుర్వినియోగమైనట్టు తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు గురువారం గ్రామానికి చేరుకుని పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. డెత్‌సర్టిఫికెట్ తీసుకున్న తేదీని విచారించగా.. పంచాయతీ నుంచి తీసుకోలేదని తేలింది. అధికారులు రాఘవేందర్‌రెడ్డి, బాలయ్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
Anirudh-Kavya | అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వార్తల్లో కొత్త ట్విస్ట్.. గ్రీస్‌లో పెళ్లి అంటూ వైరల్, అసలు నిజం ఇదేనా?
Stock Market | అంతెత్తున ఎగిసి ఆపై దిగి వచ్చి.. చివరికి లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ఎన్ఐపీజీఆర్.. మొక్కల జన్యు నిర్మాణం, పనితీరుపై పరిశోధన చేసే సంస్థ
Sonia Gandhi | ఆ ఏడాది రాహుల్‌గాంధీ పుట్టినరోజుకు ఎవరూ రాలేదు : సోనియాగాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

