యూరియా కోసం రైతుల ఇక్కట్లు.. రోడ్డెక్కిన అన్నదాతలు
యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల్లిపాదీ పడిగాపులు కాచినా ఒక్క యూరియా బస్తా కూడా దొరక్కపోవడంతో ప్రధాన రోడ్లపై ధర్నాలు,
- రాత్రి నుంచే పడిగాపులు
- కేంద్రాల వద్దనే భోజనాలు
- పలు చోట్ల తోపులాట
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9 : యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల్లిపాదీ పడిగాపులు కాచినా ఒక్క యూరియా బస్తా కూడా దొరక్కపోవడంతో ప్రధాన రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వీరికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. యూరియా ఇవ్వడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని చోట్ల మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. తమ పంటలకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల జాతీయ రహదారిపై మండల రైతులు రాస్తోరోకో నిర్వహించారు. గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతులు ప్రభుత్వానికి, వ్యవసాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ శ్రీను, ఎస్ఐ నవీన్ చేరుకుని వారిని శాంతింపజేసేందుకు యత్నించినప్పటికీ ధర్నా విరమించలేదు. ఏడీఏ రాధిక రైతులకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు శాంతించారు.
చేర్యాలలో రోడ్డెక్కిన రైతన్నలు
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం యూరియా కోసం రాస్తారోకో చేస్తున్న మండలంలోని రైతులు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు
పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పీఏసీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
ఎరువుల కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్ జిల్లా వెదిరలో రైతులతో కలిసి రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
మాచారెడ్డిలో బారులు తీరిన రైతులు

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
క్యూలో నిలబడలేక .. సొమ్మసిల్లిన రైతులు

భద్రాద్రి జిల్లా నారాయణపురం సొసైటీ వద్ద సొమ్మసిల్లి పడిపోయిన జెట్టివారిగూడెంకు చెందిన రైతు జెట్టి సింగరాజు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

