మిరుదొడ్డి, జూన్ 4 : వరి కొయ్యలు తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో చోటుచేసుకున్నది. ఎస్సై అందె సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన రైతు మద్దెల మల్లయ్య (61) తన పొలంలో గురువారం వరి కొయ్యలు తగులబెడుతుండగా మల్లయ్య చుట్టూ మంటలు వ్యాపించాయి.
పొగతో ఊపిరాడక మల్లయ్య పొలంలోనే కుప్పకూలిపోయాడు. మల్లయ్య అగ్ని కీలల్లో పడి మృతి చెందాడు. మల్లయ్య భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.