అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బంధువుల కథనం ప్రకారం.. పెండ్యాల నాగరాజు (37)కు గ్రామంలో 7.25 ఎకరాల భూమి ఉన్నది.
- హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో విషాదం
ఎల్కతుర్తి, మే 28: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బంధువుల కథనం ప్రకారం.. పెండ్యాల నాగరాజు (37)కు గ్రామంలో 7.25 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో వరి పంట వేశాడు. రెండేండ్లుగా పంట పెట్టుబడుల కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు.
పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చలేనని మనస్తాపానికి గురైన నాగరాజు పొలం వద్ద వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లి చూసేసరికి విగత జీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజుకుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

