నవ వధువుపై నకిలీబాబా లైంగికదాడి
యువతిపై ఓ నకిలీ బాబా అఘాత్యానికి ఒడిగట్టాడు. దయ్యం వదిలిస్తానని నమ్మించి, లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్‌అలీ వివరాలను వెల్లడించారు. భవానీనగర్ ప్రాంతంలో నివసించే ఓ యువతికి మూడు నెలల క్రితం పెండ్లి జరిగింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అత్తామామ వైద్యం కోసం బండ్లగూడలో ఉండే మదర్ఖాన్(35) వద్దకు తీసుకెళ్లారు.
- దయ్యం వదిలిస్తానని అఘాయిత్యం
- ఆలస్యంగా వెలుగులోకి ..
చాంద్రాయణగుట్ట, ఆగస్టు 30: యువతిపై ఓ నకిలీ బాబా అఘాత్యానికి ఒడిగట్టాడు. దయ్యం వదిలిస్తానని నమ్మించి, లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్‌అలీ వివరాలను వెల్లడించారు. భవానీనగర్ ప్రాంతంలో నివసించే ఓ యువతికి మూడు నెలల క్రితం పెండ్లి జరిగింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అత్తామామ వైద్యం కోసం బండ్లగూడలో ఉండే మదర్ఖాన్(35) వద్దకు తీసుకెళ్లారు.
ఆమెకు దయ్యం పట్టిందని, మంత్రాలతో వదిలిస్తానని బాబా నమ్మించాడు. పలుమార్లు యువతి ఇంటికి వెళ్లిన బాబా, గత నెల రెండో వారంలో బండ్లగూడలోని తన ఇంటికి రమ్మని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తామామను ఇంటి బయట ఉంచి, యువతిని ఇంట్లోకి తీసుకెళ్లి, కండ్లకు గంతలు కట్టి ఆమెపై లైంగికదాడి చేశాడని బాధితురాలి తల్లి గత నెల 19న భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును మూడు రోజుల క్రితం భవానీనగర్ పీఎస్ నుంచి బండ్లగూడ ఠాణాకు బదిలీ చేశారు. బండ్లగూడ పోలీసులు రంగంలోకి దిగి, నకిలీబాబా మహారాష్ట్ర నుంచి పాతబస్తీకి వచ్చినట్టు తెలుసుకున్నారు. విషయం తెలుసుకొని నకిలీబాబా పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

