హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో బెలగావి-భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వారు పేర్కొన్నారు. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.