హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల పది వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.200 ఫైన్‌తో 16 వరకు, రూ.1000 ఫైన్‌లో 23 వరకు, రూ.2000 ఫైన్‌తో మార్చి 3వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు శుక్రవారం వెల్లడించింది.