దళిత బంధు పథకాన్ని వ్యతిరేకించే వారిని తరిమికొట్టండి
దళిత బంధు పథకం | దళిత బంధు పథకాన్ని వ్యతిరేకించే వారిని తరిమికొట్టండని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.

కరీంనగర్ : దళిత బంధు పథకాన్ని వ్యతిరేకించే వారిని తరిమికొట్టండని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఇల్లందకుంట మండలం పాతర్లపాడు గ్రామంలో ప్రజలతో మండల ఇంచార్జి, ఎమ్మెల్యే రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు పథకాన్ని అడ్డుకునే వారిని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. ప్రతిపక్షాలు వారి చిల్లర రాజకీయాల కోసం దళితులను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
నేను ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, దళిత ప్రజా ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. దళితులకు ఏదైనా పథకం రూపొందించాలని, వారు శాశ్వతంగా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలిచిపోయే విధంగా పథకం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం గురించి రూపకల్పన చేశారు. అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
దళిత బంధు పథకం అనేది హుజరాబాద్ ఉప ఎన్నికల కోసం వచ్చింది కాదన్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్మెంట్ స్కీం కి వెయ్యి కోట్లు ప్రవేశపెట్టారు. దళిత ఎంపవర్మెంట్ స్కీమే దళిత బంధు పథకం అన్నారు. అలాగే సీఎం అడగకముందే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ ప్రతిపక్ష నాయకులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

