Exit Polls | నేడు ఎగ్జిట్ పోల్స్.. సాయంత్రం 6.30 తర్వాత విడుదల
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజలు ఎటువైపు మొగ్గారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది.
- ఈవీఎంలలో ఓటరు తీర్పు నిక్షిప్తం
- 19 రోజులుగా అభ్యర్థుల్లో టెన్షన్
- సమయం దొరకడంతో సర్వేలపై నమ్మకం
- విహారయాత్రల నుంచి తిరిగొస్తున్న నేతలు
Exit Polls | హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజలు ఎటువైపు మొగ్గారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ టెన్షన్ నుంచి కొందరికి శనివారం కాస్త ఉపశమనం దొరికే అవకాశముంది. నేడు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ విడుదల కానున్నాయి. చివరి విడత పోలింగ్ ముగిసే దాకా ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో మే 13నే పోలింగ్ ముగిసినా, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించడం లేదు. అటు రాజకీయపార్టీలు, ఇటు సర్వే సంస్థలు జూన్ 1వ తేదీ కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాల అంచనాలు శనివారం విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్‌పైనే అందరి కండ్లూ నిలిచి ఉన్నాయి.
ఈ సారి మరింత పక్కాగా?
సాధారణంగా పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటారు. దీంతో సర్వే సంస్థల అభిప్రాయ సేకరణ విస్తృతంగా జరగదనే అభిప్రాయం ఉన్నది. పోలింగ్‌కు ముందు, తర్వాత సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి అంచనాలు వేస్తుంటారు. ఈ సారి అందుకు భిన్నంగా సర్వే సంస్థలకు రెండువారాలకు పైగా సమయం దొరికింది. పోలింగ్ తర్వాత విస్తృతంగా సర్వే చేసి జనాభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం దక్కింది. ఇందుకు తగ్గట్టే అనేక సంస్థలు సుదీర్ఘంగా సర్వే కొనసాగించాయి. కాబట్టి ఈసారి ఫలితాలు మరింత కచ్చితత్వంతో ఉంటాయన్న నమ్మకం కుదిరింది.
విహారయాత్రలకు సెలవు
పార్టీల అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు దాదాపు రెండు నెలలపాటు మండుటెండల్లో చెమటోడుస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. పోలింగ్ తర్వాత ఫలితాల విడుదలకు సమయం ఉండటంతో అభ్యర్థులు, నేతలు విహారయాత్రలకు వెళ్లారు. కొందరు ఇంటికే పరిమితం కాగా, కొందరు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫామ్‌హౌసుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ రానుండంతో ఒక్కొక్కరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విహారయాత్రలు ముగించుకొని తిరుగుపయనమయ్యారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఏకంగా రెండు వారాలపాటు లండన్ పర్యటనకు వెళ్లారు. శనివారం ఉదయం ఏపీకి రానున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం పది రోజుల విదేశీయాత్ర ముగించుకొని ఇటీవలే తిరిగొచ్చారు. తెలంగాణ రాష్ట్ర నేతలదీ ఇదే పరిస్థితి. మొత్తంగా పోలింగ్ తర్వాత చల్లబడ్డ రాజకీయ వాతావరణం ఎగ్జిట్ పోల్స్‌తో మళ్లీ వేడెక్కనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

