హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : నిందితులకు శిక్షలు పడేలా చార్జీషీట్స్ వే యాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆబ్కారీ భవన్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది 31 మందికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, ఎన్డీపీఎల్పై దృష్టి పెట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖలో నలుగురు అధికారుల పర్యవేక్షణలో 90 మందిపైగా సిబ్బం ది ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నారని, ఒ కొక టీమ్ తమదైన ప్రతిభ చూపిందని కొనియాడారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి ‘ఆపరేషన్ దూల్పేట్’లో మంచి ఫలితాలు సాధించారని, ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్‌రావు రేవ్ పార్టీల్లో అల్పోజలం అమ్మే కీలక వ్యక్తిని అరెస్టు చేశారని, సివిల్ పోలీస్ విభాగంలో డీఎస్పీ తిరుపతియాదవ్, తుల శ్రీనివాసరా వు పనితీరు మెరుగ్గా ఉందని అభినందించా రు. ఢిల్లీ, హర్యానా, గోవా ప్రాంతాల నుంచి వచ్చే ఎన్డీపీఎల్పై దృష్టిసారించాలని సూచించారు. ఎక్సైజ్ జేసీ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.