Vinod Kumar | ఆ నిర్ణయం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం : వినోద్ కుమార్
Vinod Kumar | జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీ - లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Vinod Kumar | హైదరాబాద్ : జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను డీ – లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎంపీ స్థానాల విధానాన్నే కొనసాగించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనాభా ప్రాతిపధికన లోక్ సభ స్థానాలను డీ లిమిటేషన్ చేస్తే జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే లాభం జరుగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో జనాభా సంఖ్య తక్కువగా ఉందని వినోద్ కుమార్ తెలిపారు. 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని లోక్సభ స్థానాలను నిర్ణయించారని, ఇక ముందు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని, అవసరం అయితే అందుకు రాజ్యాంగాన్ని సవరించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు బట్టారాని, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఉదాహరణకు తీసుకుంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జనాభా 8.8 కోట్లు కాగా, తాజా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 24 కోట్లకు చేరుతుందని, దీంతో యూపీలో ఎంపీ స్థానాలు అమాంతం భారీగా పెరుగుతాయని వినోద్ కుమార్ వివరించారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో కార్యాచరణను రూపొందిస్తామని వినోద్ కుమార్ ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

