Harish Rao | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 12 : సమతాస్పూర్తి స్పూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభ్ 108 దివ్యదేశాలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌స్వామివారి ఆశీస్సులు హరీశ్‌రావు స్వీకరించారు.
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని యాగశాలకు వచ్చి అర్చకులతో కంకణధారణ చేయించుకున్నారు. దీంతో పాటు తీర్థగోషిలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారి నుంచి తీర్థం స్వీకరించారు. అనంతనం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో సమతామూర్తి స్పూర్తి కేంద్రాన్ని నిర్మాణం చేసి పర్యటక కేంద్రంగా మార్చారని గుర్తు చేశారు. ఆయనతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.