Harish Rao | అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయట అవే అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు.
13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టీవీవీపీ విభాగంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా? డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది మీ కళ్లకు కనిపించడం లేదా? ఆరోగ్య శాఖలోనే కాదు, పోలీసు శాఖలోనూ ఇదే దుస్థితి. పెంచిన జీతాలు, అలవెన్సుల మాట దేవుడెరుగు, ఉన్న జీతాలు ఇప్పటికీ రాక హోంగార్డులు ఆవేదన చెందుతున్నది నిజం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామనే అబద్దాన్ని, అవకాశం ఉన్న చోటల్లా ప్రచారం చేసుకునే మీకు.. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల ఆవేదన అర్థం కావడం లేదా? దుష్ర్పచారంతోనే ఏడాదిన్నర గడిపారు. ఇంకెంత కాలం వెళ్లదీస్తారు.? టీవీవీపీ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

