Harish Rao | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా పని చేసిన హరీశ్‌ను కేసీఆర్ సీఎం చేయరు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు భగ్గుమన్నారు.
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా పని చేసిన హరీశ్‌ను కేసీఆర్ సీఎం చేయరు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు భగ్గుమన్నారు.
రేవంత్ రెడ్డి దబాయించగానే మైక్ కట్ చేయండం ఏంటి..? మా హక్కులు హరించడం ఏంటి..? అని హరీశ్‌రావు మండిపడ్డారు. మీ పార్టీ లాగా రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు. రాజగోపాల్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆయన విత్ డ్రా చేసుకుంటే మేం రెడీ. పీసీసీ పదవిని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని కోమటిరెడ్డి బ్రదర్సే మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకునేందుకు రెడీగా ఉన్నాను.
నేను కామెంట్ చేయలేదు సభా నాయకుడిపై. వారి వైపు నుంచి ఇష్టారీతిగా కామెంట్ చేసినప్పుడు.. నేను వారు బయట చేసిన మాటలను గుర్తు చేశాను. ఇదేదో నేను సొంత వ్యాఖ్యలు చేయలేదు. మా పార్టీ మీద చేసిన కామెంట్స్‌ను విత్ డ్రా చేసుకుంటే నేను రెడీ. సభా సజావుగా నడవాలన్నదే నా అభిప్రాయం. కొత్త ఆరోపణలు చేయలేదు అని హరీశ్ రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- CM Revanth
- harish rao
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

