Errabelli Dayaker Rao | అన్నదాతలకు మద్ధతుగా ధర్నా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్
Errabelli Dayaker Rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు.
Errabelli Dayaker Rao | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు. దీంతో సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనకు దిగిన అన్నదాతలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతు ప్రకటించారు. ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు.
యూరియా కోసం రోడెక్కిన రైతులు
మద్దతు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా ధర్నాకు దిగిన రైతులు
రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులకు,… pic.twitter.com/68QVF9mCQt
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

