పార్టీ కోసం నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లభిస్తుందని, రాష్ట్ర భవిష్యత్తుకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్షని బీఆర్ఎస్ ఎన్నారై యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు. లండన్‌లో అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నారై యూకే విసృ్తత కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
16 ఏండ్లుగా యూకేలో ఎన్నారైలు పార్టీకి అందిస్తున్న సేవలను కొనియాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎల్లప్పుడూ ఎన్నారైలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సమావేశంలో యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు తెలంగాణ ఎన్నారైలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.