హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రూ పొందించిన ఈవెనింగ్ బీటెక్‌ను రాష్ట్రంలోని ఆరు కాలేజీల్లో నిర్వహించనున్నారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీతోపాటు మరో ఐదు కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీచేయనున్నారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో జూలై 21న పరీక్ష నిర్వహించనున్నారు. జూలై 11వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కోర్సుల్లో చేరిన వారికి సాయంత్రం 6 నుం చి రాత్రి 9:30వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆదివారం థియరీ, ప్రాక్టికల్ తరగతులుంటాయి. పూర్తి వివరాలకు https: //www.uceou.edu వెబ్‌సైట్‌ను సం ప్రదించాలని ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.
ఈవెనింగ్ బీటెక్ కోర్సు అందుబాటులో ఉన్న కాలేజీలు
5 విడుతల్లో ఎంబీబీఎస్ ఫీజు
ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు ను విద్యార్థుల నుంచి ఐదు విడుతల్లో వసూలు చేయాలని ఫీజు రెగ్యులేటరీ కమి టీ బుధవారం ఆదేశించింది. నాలుగున్నరేండ్ల కోర్సు, 9 సెమిస్టర్లను ఐదేండ్లుగా విభజించినట్టు తెలిపింది. ఫీజు మొత్తం ఒకేసారి వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో ఒక్కో విడుత ఫీజును వసూ లు చేయాలని స్పష్టంచేసింది. ఉదాహరణ కు ఒక కాలేజీలో ఏడాదికి రూ.14.5 లక్షలు ఫీజు అనుకుంటే.. నాలుగున్నరేండ్లకు కలిపి రూ.65.25 లక్షలు అవుతుందని పేర్కొన్నది. మొత్తాన్ని 5 విడుతల్లో విభజించి ఒక్కో ఏడాదికి రూ.13.05 లక్షలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.