Vemula Prashanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంపై ఎథిక్స్ కమిటీ చర్చించాలి : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్న అసభ్య పదజాలంపై ఎథిక్స్ కమిటీ లో కూడా చర్చించాలని మాజీ మంత్రి ,ఎథిక్స్ అసెంబ్లీ కమిటీ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) వాడుతున్న అసభ్య పదజాలంపై ఎథిక్స్ కమిటీ ( Ethics Committee) లో కూడా చర్చించాలని మాజీ మంత్రి ,ఎథిక్స్ అసెంబ్లీ కమిటీ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో మాట్లాడారు. ఎథిక్స్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ వాదనను బలంగా వినిపించామని వెల్లడించారు.
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పై వివాదం జరిగిన రోజు 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ లో మాట్లాడించారు. అది మూడ్ అఫ్ ది హౌజ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ సభ్యుల మాటల ఆధారం గా పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఎజెండాగా చేర్చారని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం పై ఎథిక్స్ కమిటీ చర్చించాలని అసెంబ్లీ చైర్మన్ను కోరామని తెలిపారు. రేవంత్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్ ,దానం నాగేందర్ , వీర్లపల్లి శంకర్ , మందుల శామ్యూల్స్ సభలో అనుచితంగా మాట్లాడటం , ప్రవర్తించడంపై ఎథిక్స్ కమిటీకి రాత పూర్వకంగా పిర్యాదు చేశామని, వారు మాట్లాడిన వీడియోలు ఆధారంగా సమర్పించామని వివరించారు.
తమ విజ్ఞప్తి పై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. బీజేపీ , బీఆర్ఎస్లు సహకరించు కుంటున్నాయన్న ఎథిక్స్ కమిటీ కాంగ్రెస్ సభ్యుడి ఆరోపణలో నిజం లేదని కొట్టిపారేశారు.
కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గత ప్రభుత్వ అన్ని పథకాలు కొనసాగుతున్నాయ నడంలో నిజం లేదని స్పష్టం చేశారు. రైతు బీమాకు ప్రీమియం కట్టకపోవడంతో దానిని నిలిపివేశారని ఆరోపించారు. కొండసురేఖ వ్యవహారంపై ఏం జరుగుతుందో తెలియదు
..రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

