వరంగల్ సైన్స్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు : మంత్రి ఐకే రెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్, మే 26 : వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ శాస్త్ర, సాంకేతిక మండలి సాధించిన విజయాలు, ప్రగతిపై మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు టీఎస్కాస్ట్ (TSCOST) మంచి పనితీరును కనబరుస్తుందని చెప్పారు.
రూ. 14.51 కోట్లతో వినూత్నంగా 7 ప్రాజెక్ట్ లను అమలు చేస్తుందని, వాటిలో వరంగల్ లోని రీజినల్ సైన్స్ సెంటర్ (ఆర్ఎస్సీ) లో ఇన్నోవేషన్ హబ్, విశ్వవిద్యాలయాలు/పరిశోధనా సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద స్కిల్ డెవలప్మెంట్, వరంగల్ సైన్స్ సెంటర్లో ఎస్-ఎస్టీ సెల్ ఏర్పాటు, నేషనల్ సైన్స్ డే & నేషనల్ మ్యాథమ్యాటిక్స్ డే వేడుకలు, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

రూ. 42.41 కోట్లతో నిర్మల్‌లో సైన్స్ సెంటర్, ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సైన్స్ సెంటర్ కు 5 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS), జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNFAU) సహకారంతో టీఎస్కాస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్టును అమలు చేస్తామన్నారు.
మొత్తం 8 క్లస్టర్లను ఎంపిక చేసి ఎస్సీ క్యాటగిరీలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలాల్లో 5 క్లస్టర్లలో, ఎస్టీ క్యాటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారం 3 క్లస్టర్లను ఎంపిక చేశామన్నారు.
వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విద్యావంతులైన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి లేదా వ్యవస్థాపక కార్యకలాపాలు చేపట్టేలా నైపుణ్య శిక్షణ ఇస్తారన్నారు.
రూ 2.88 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 8 యూనివర్సిటీల్లో పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (PIC) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పర్యవేక్షణలో టీఎస్కాస్ట్ మెరుగైన ప్రగతి సాధించిందని, టీఎస్కాస్ట్ మెంబర్ సెక్రటరీ మారుపాక నగేష్, ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

