శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 06:59:20

బేగంపేట్‌లో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు..

బేగంపేట్‌లో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు..

కందుకూరు : కాశీ విశ్వనాథ్‌ తీర్థయాత్రకు వెళ్లివచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను బేగంపేట్‌ గ్రామంలో సర్పంచ్‌ గోవర్ధన్‌ క్వారంటైన్‌ను ఏర్పాటు చేయించారు. కందుకూరు మండల పరిధిలోని సరస్వతిగూడ గ్రామానికి చెందిన ఇద్దరు, గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నలుగురు, తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు, బేగంపేట్‌ గ్రామానికి చెందిన పదమూడు మంది, దెబ్బడగూడ గ్రామానికి చెందిన ఒకరు, మహేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు మొత్తం 28మంది బస్సులో వారణాసి, మహారాష్ట్ర తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. మొదటగా బేగంపేట్‌ గ్రామానికి వారిని వదలడానికి బస్సు రాగా, సర్పంచ్‌ గోవర్ధన్‌, డీఎంఎచ్‌ఓ సురేందర్‌, తహసీల్దారు జ్యోతి, సీఐ జంగయ్యలకు సమాచారం అందించారు. బేగంపేట్‌ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో పరీక్షలు నిర్వహించగా ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. అయితే ఈ నెల 31 వరకు క్వారంటైన్‌ కేంద్రం కొనసాగుతుందని సర్పంచ్‌ గోవర్ధన్‌ తెలిపారు.


logo