హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): చైర్మన్సహా తొమ్మిది మంది సభ్యులతో కూడిన కనీస వేతన సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్‌గా పీ నారాయణ, స్వతంత్ర సభ్యులుగా మంచె నర్సింహులు, పీ నర్సయ్యను నియమించారు.
యాజమాన్యాల ప్రతినిధులుగా కట్కం చేతన్, ఆర్ దుర్గాప్రసాద్, సీ నిరంజన్‌రావు, ఉద్యోగుల ప్రతినిధులుగా బాశబోయిన శివశంకర్, సనికొమ్ము శంకర్‌రెడ్డి, జే మల్లికార్జున్ తదితరులను నియమించారు. సలహా మండలి పదవీకాలం నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రెండు సంవత్సరాలు ఉంటుంది. కనీస వేతనాల కమిటీ కార్యదర్శి ఈ సలహా మండలిలో ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కొనసాగుతారు.