Student Suicide : బెట్టింగ్ వ్యసనం మరో విద్యార్థిని బలితీసుకున్నది. హైదరాబాద్ శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్లో లక్ష రూపాయలు నష్టపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలలో ఫీజు చెల్లించేందుకని ఈ ఉదయం తన తల్లి నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లిన విద్యార్థి.. ఆ మొత్తాన్ని బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు.
లక్ష రూపాయలు పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఘట్కేసర్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.