హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులకు 2017 వేతన సవరణ ఆధారంగా అలవెన్సులు, బెనిఫిట్స్ చెల్లించాలని ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు బుధవారం ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందజేశారు.
యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వెంకన్న మాట్లాడుతూ కార్మిక వర్గానికి రావాల్సిన బెనిఫిట్స్ అందేలా చొరవ చూపాలని అధికారులను కోరారు. గతంలో ఆర్టీసీ వేతన సవరణతో పాటు అలవెన్సులు పెంచేవారని గుర్తుచేశారు. ఆ విధానాన్ని తుంగలో తొక్కి2013 వేతన సవరణను అమలు చేస్తున్నదని వివరించారు.