TVVP | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు వేశాం.. సీఎం రేవంత్రెడ్డి మొదలు ప్రభుత్వ పెద్దలంతా చేసుకుంటున్న ప్రచారం ఇది. కానీ, ఇప్పటివరకు తమకు వేతనాలు అందలేదని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీవీవీపీ పరిధిలో శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి సుమారు 12,000 మంది వరకు పనిచేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని డీపీహెచ్, డీఎంఈ విభాగాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెల ప్రారంభంలోనే వేతనాలు వేశారు. టీవీవీపీ పరిధిలోని ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు అందలేదు. దీంతో ఉగాది పండుగనాడు కూడా పస్తులే ఉన్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.