పరుష పదజాలంతో ఉద్యోగులను దూషిస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఆబ్కారీ కమిషనర్ తీరునుతెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా ఖండించింది. 30 ఏళ్లు ఆబ్కారీ శాఖకు సేవలందించిన ఉత్తమ అధికారిగా పేరొందిన నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అదే శాఖ కమిషనర్ అకారణంగా దూషించడం పట్ల చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడ్నాల రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిపై ఆబ్కారీ కమిషనర్ వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. అబ్కారీ శాఖ కమిషనర్ వ్యవహారంపై ప్రత్యక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలన్నారు.
Excise Department | ఇడియట్.. పండబెట్టి తొక్కుతా.. ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి నోటి దురుసు!