హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : 2024-25 విద్యా సంవత్సరంలో నేషనల్ స్పేస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ కాంపిటీషన్స్‌లో నారాయణ విద్యార్థులు సత్తా చాటినట్టు ఆ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్ సింధూరనారాయణ, శరణినారాయణ వెల్లడించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరల్డ్గ్రాండ్ ప్రైజ్‌తోపాటు వరల్డ్ నంబర్-1 స్థానంలో 12 సెలెక్షన్స్, వరల్డ్ నంబర్-2 స్థానంలో 17, వరల్డ్ నంబర్-3 స్థానంలో 14 సెలెక్షన్స్తోపాటు 55 హానరబుల్ ప్రైజ్‌లను కైవసం చేసుకున్నట్టు వివరించారు.
మొత్తం విజేతల్లో నారాయణ విద్యార్థుల సక్సెస్ శాతం అంతర్జాతీయ స్థాయిలో 34.1 శాతం, జాతీయ స్థాయిలో 58.5 శాతం ఉన్నట్టు చెప్పారు. నేషనల్ స్పేస్ సొసైటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కాంటెస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలు వేలాది ప్రాజెక్టులతో పాల్గొననున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షల కోసం ప్రత్యేక ప్రోగ్రామ్స్‌ను అమలుపరుస్తున్న ఏకైక విద్యాసంస్థ నారాయణ మాత్రమే అని పేర్కొన్నారు. ఇందుకోసం సీవోస్పార్క్, ఒలింపియాడ్, ఈ-టెక్నో, మెడిస్పార్క్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్స్‌తోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ అభినందించారు.