Adilabad | ఆదిలాబాద్ అడవుల్లో ఏనుగు.. పొలం పనులు చేసుకుంటున్న రైతుపై దాడి
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
- గజరాజు దాడిలో అన్నదాత మృతి
- భార్య కళ్లెదుటే ప్రాణాలొదిలిన భర్త
- ఆసిఫాబాద్ జిల్లా బూరెపల్లిలో ఘటన
- భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు
- మృతుడి కుటుంబానికి 10 లక్షలు: సురేఖ
Adilabad | చింతలమానేపల్లి, ఏప్రిల్ 3: పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది. బూరెపల్లికి చెందిన రైతు అల్లూరి శంకర్ (55), తన భార్య సుగుణతో కలిసి మధ్యాహ్నం తమ తోటలో మిరపకాయలు ఏరుతున్నారు. అదే సమయంలో బూరెపల్లి-రణవెల్లి గ్రామాల మధ్య చేలల్లో ఏనుగు తిరగడాన్ని స్థానిక రైతులు గమనించారు. జనవాసాల్లోకి వచ్చి ఎక్కడ దాడి చేస్తుందోనని భావించి కేకలు వేయగా, అది చేలల్లో గుండా పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్‌పై దాడి చేసింది. తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కళ్లముందే తన భర్తను ఏనుగు దాడి చేసి చంపిందని సుగుణ రోదిస్తూ తెలిపింది.
చేను సమీపంలోకి ఏనుగు వస్తున్నదని తన భర్తకు చెప్పుకుంటూ పరిగెత్తానని, ఇంతలోనే చెట్ల పొదల మధ్య దాక్కున్న తన భర్తపై తొండంతో దాడి చేసి చంపిందని చెప్తూ కన్నీరుమున్నీరైంది. మృతుడికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలను డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ సాధిక్ పాషా అందజేశారు. ఏనుగు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి మంగళవారం తెలంగాణలోకి వచ్చిన ఏనుగే ఈ దాడికి పాల్పడి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి ఏనుగు లంబాడిహెట్టి, బాబాపూర్, రవీంద్రనగర్, బాలాజీ అనుకోడ గ్రామ శివారుల్లోని చేలల్లో సంచరిస్తున్నట్టు తెలిసింది.
మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి
అసిఫాబాద్ జిల్లా కర్జెల్లి అటవీప్రాంతంలో బుధవారం ఏనుగు దాడిలో అల్లూరి శంకర్ అనే రైతు మృతి ఘటనపై అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి మంత్రి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ మొత్తన్ని వెంటనే అందజేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

