హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా పాపకంటి అంజయ్య ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ మింట్కంపౌండ్లోని విద్యుత్తు ప్రభభవన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది.
వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా సీహెచ్ శ్యామలరావు, ఎంఏ నాజర్ షరీఫ్, ఫైనాన్స్ సెక్రటరీగా పీ అనిల్, మహిళా కార్యదర్శిగా సీహెచ్ అనురాధ, సంయుక్త కార్యదర్శులుగా జే స్వామి, వీ పరమేశ్, ఎల్ దేవిదాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కే నర్సింహారాములు, ఎస్ మురళయ్య, కే వెంకటేశ్, సీహెచ్ మధు ఎన్నికయ్యారు.