హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల బదిలీలే ఏకైక ఎజెండాగా ముందుకెళ్దామని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఎన్నికల బదిలీలను ఇప్పుడు చేసుకోకపోతే.. భవిష్యత్తులో మరెప్పుడూ కావని అన్నారు. ఈ అవకాశాన్ని రెవెన్యూ ఉద్యోగులుగా మనమంతా కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే కలిసికట్టుగా ముందుకెళ్లాలని స్పష్టంచేశారు.
ఈ మేరకు గురువారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయా ్యయి. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూశాఖలో ఉద్యోగులు ఎ న్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. బదిలీల అంశాన్ని ప్రభుత్వం ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీతోపాటు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎన్నికల బదిలీలు జరిగి రెండేండ్లు కావస్తోందని, తద్వారా ఆయా ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు.