Panchayat Elections | పంచాయతీ గుర్తులు విడుదల.. బ్యాలెట్ చివరన నోటా ఆప్షన్ కూడా
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 చొప్పున గుర్తులను కేటాయించినట్టు సమాచారం.
Panchayat Elections | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసినట్టు తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 చొప్పున గుర్తులను కేటాయించినట్టు సమాచారం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం.. సెక్షన్ 200 కింద సర్పంచ్, వార్డు అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఉచిత గుర్తులను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీచేసిందని తెలిసింది. బ్యాలెట్లో అభ్యర్థుల జాబితాలో చివరన నోటా గుర్తు కూడా ఉంటుంది.
అభ్యర్థుల్లో ఎవరూ కూడా నచ్చకపోతే నోటా (నన్ ఆఫ్ ది ఎబో) ఆప్షన్‌ను ఓటర్లు ఎన్నుకోవచ్చు. తొలి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగియనున్నది. నామినేషన్ల ప్రక్రియ, అప్పీళ్ల స్వీకరణ పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 3న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. సోషల్ మీడియాలో ఫ్రీ సింబల్స్ పేరుతో అనేక గుర్తులు ప్రచారంలోకి వస్తుండటంతో వాటిని నియంత్రించేందుకు, అపోహలను తొలగించేందుకు ఎస్ఈసీ 2023 డిసెంబర్లో సిద్ధంచేసి పెట్టిన గుర్తులను తాజాగా విడుదల చేసింది.
సర్పంచ్ గుర్తులు ఇవే..
సర్పంచ్ అభ్యర్థులకు ఈసారి 30 గుర్తులను కేటాయించారు. వీటిలో ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీపర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బ, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మాన్, మనిషి తెరచాప పడవ, బిస్కట్, వేణువు (పిల్లనగ్రోవి), చెయిన్ (గొలుసు), చెప్పులు, బెలూన్, వికెట్లు ఉన్నాయి.
వార్డు స్థానాల గుర్తులు ఇవే..
వార్డు అభ్యర్థులకు మాత్రం 20 గుర్తులను ఎస్ఈసీ అధికారులు కేటాయించారు. వీటిలో గౌను, గ్యాస్‌స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్ యాంటినా, గరాటా (గౌరా), మూకుడు, ఐస్‌క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వోలప్ కవర్, హాకీ బ్యాట్ బంతి, నెక్ టై, కట్టింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్తు స్తంభం, కెటిల్ ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

