BJP | కమలం కకావికలం.. సీనియర్ల అలక.. జూనియర్లకు అభద్రత
రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది.
- బీజేపీలో పెరుగుతున్న వర్గపోరు
- నాలుగు దిక్కులుగా నలుగురు ఎంపీలు
- ఒకరి ముఖం ఒకరు చూసుకోని ఎమ్మెల్యేలు
- అధ్యక్ష పదవికోసం ఎత్తుకు పైఎత్తులు
BJP | ఓ వైపు తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ.. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత కుమ్ములాటలతో కకావికలం అవుతున్నాయి. సంక్షేమ పాలనతో సీఎం కేసీఆర్ ప్రజల్లో గుడి కట్టుకొని కూర్చొంటే..అందని ముక్క కోసం నక్క కాచుకొని కూర్చొన్నట్టు అధికారం కోసం హస్తం, కమలం పార్టీలు గాల్లో మేడలు కడుతున్నాయి. ఆ రెండు పార్టీలూ ఆధిపత్య, వర్గపోరుతో తమలో తామే కొట్టుకొంటూ ప్రజల్లో చులకనైపోతున్నాయి.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది. నలుగురు ఎంపీలు నాలుగు దిక్కులుగా వ్యవహరిస్తుండగా.. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనే పరిస్థితి లేదు. దీంతో వాపును చూసి బలుపు అనుకొని విర్రవీగిన ఆ పార్టీ ఇప్పుడు గల్లీ నుంచి రాష్ట్రస్థాయి దాకా కకావికలం అయ్యింది. సీనియర్లు అలకల మీద ఉండగా, జూనియర్లు అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. అందరినీ ఒక్కతాటిమీదికి తేవాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతులెత్తేశారు. సిల్లీ విమర్శలు, చీప్ పాలిటిక్స్‌తో జనాల్లో చులకన అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతున్నదో తెలియక ఢిల్లీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
ఎవరికివారే యమునా తీరే!
బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికివారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారు. ఒంటెత్తు పోకడలు, నియంతృత్వ ధోరణితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీని బంగాళాఖాతంలో ముంచేశారు. ఇక సోయం బాపూరావ్ అనే ఓ ఎంపీ బీజేపీలో ఉన్నాడనే విషయం ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలకు తెలియదు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో అడుగు పెట్టక నెలలు గడుస్తున్నది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రులు వచ్చినా బాపురావ్ హాజరుకారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్లినా కనీసం పట్టించుకోరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన దారి తనదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరూ హామీ ఇవ్వకపోయినా ఆర్మూర్ నియోజకవర్గంలో తనే అభ్యర్థిని అని ప్రకటించుకోవడం, బండి దానిని ఖండించడంతో ఇద్దరి మధ్య వైరం మొదలయ్యింది.
మరో ఎంపీ కిషన్‌రెడ్డిది ప్రత్యేక వైఖరి. పార్టీతో తనకు సంబంధమే లేనట్టు, కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు. బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుండగా రాజాసింగ్‌ను ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించారు. ఈటల రాజేందర్ తనకు అధ్యక్ష పదవి వస్తుందని, ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. బండి తనను విఫల నేతగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. పార్టీ పెద్దలు హుటాహుటిన శుక్రవారం ఈటలను ఢిల్లీకి పిలిచారు. దు బ్బాక ఎమ్మెల్యే మిగ తా వారితో పెద్దగా కలవడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అలకలు..లుకలుకలు
బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలంతా అలకల మీదే ఉన్నారు. డీకే అరుణ హైదరాబాద్‌కు, పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడమే మానేశారు. విజయశాంతి ఎప్పటి నుంచో బండిపై గుర్రుగా ఉన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి నేతలదీ దాదాపు ఇదే దారి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని విడిచి కాంగ్రెస్‌కు ఎంత మంది పోతారోనని ఆ పార్టీ పెద్దలు దినదినగండంగా గడుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

