IPS Transfers | రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ..
రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజరావు భూపాల్ ను ట్రాన్స్ఫర్ చేశారు.
సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్ నియమితులయ్యారు.
కాగా, రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. రోడ్ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తక్షణమే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి రిలీవింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై ఆయన రిలీవింగ్ ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణాలోనే పనిచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

