విద్యాసంస్థలకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
ఉన్నత విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేయాలని నిర్ణయించింది.
- ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో నూతన విద్యా విధానం
- తొలుత వర్సిటీలు, ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు జారీ
- దశలవారీగా మిగతా కాలేజీలకూ ర్యాంకుల కేటాయింపు
- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి
- పరిశోధనలను ప్రోత్సహించేలాప్రత్యేకంగా రిసెర్చ్ సెల్ ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేయాలని నిర్ణయించింది. ప్రాథమికంగా ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు.. దశలవారీగా మిగతా కాలేజీలకు ర్యాంకులు కేటాయించనున్నది. ఈ మేరకు బుధవారం జరిగిన ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందించి అమలు చేయనున్నారు.
ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో..
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేస్తున్నది. ఇదే తరహా రాష్ట్రంలోనూ ర్యాంకులు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పలు రాష్ర్టాలు సొంతంగా ర్యాంకులు జారీచేస్తున్నాయి. కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో విద్యాసంస్థలకు ర్యాంకులు జారీచేస్తున్న విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు అధ్యయనం చేశారు. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నేపా), ఎన్ఐఆర్ఎఫ్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ ప్రసాద్ నుంచి సలహాలు తీసుకొన్నారు. ఆయా వివరాలను బుధవారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ముందుంచారు. వీటిపై సమగ్రంగా చర్చించి తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించారు.
అనుమతులు ఆన్లైన్లో
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల ఏర్పాటుకు, కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేందుకు, కోర్సుల మార్పిడికి ఇచ్చే అనుమతుల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో, పేపర్‌లెస్ పద్ధతిలో జరపాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానంలో అమల్లోకి రానున్నది. ఇందుకోసం సింగిల్ విండో వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రత్యేకంగా రిసెర్చ్ సెల్
వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులు గత కొనేండ్ల నుంచి పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చి నూతన ఆవిష్కరణలను రూపొందిస్తున్నారు. అంతటితో ఆగకుండా అనేక పేటెంట్ హక్కులను సొంతం చేసుకొంటున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు రిసెర్చ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఎన్ఐఆర్ఎఫ్ సహా రాష్ట్రస్థాయిలో జారీచేసే ర్యాంకుల్లో పరిశోధనలకే పెద్దపీట వేస్తుండటంతో ప్రత్యేకంగా రిసెర్చ్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Education System
- NIRF
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

