Minister Talasani | ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐ దాడులు : మంత్రి తలసాని
Minister Talasani | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతుందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతుందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) ఆరోపించారు. ఆదివారం కొమురవెళ్లి మల్లన్నను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని, ప్రశ్నించే గొంతులను నొక్కడం సరి కాదని పేర్కొన్నారు.
వేల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన వారిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కూతురు కవిత ఉద్యమాలే ఊపిరిగా, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను,మహిళలను కించపరిచే విధంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే, కొందరు దేవుళ్ల పేరుపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నాయకత్వంలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు.రానున్న ఎన్నికలలో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

