హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు మరోసారి సత్తాచాటుతూ టాప్ 100 ర్యాంకుల్లో 51ర్యాంకులు సాధించారు.. ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో తమ విద్యార్థులు టాప్ 10లో 5 ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్. పి.సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో తమ విద్యార్థి బి.అన్షుల్ రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంక్‌ను, ఆదుల సాయినిఖిత్ 5వ ర్యాంకు, మల్లవరపు అస్నా 6వ ర్యాంక్, వివాన్ శరద్ మహేశ్వరి 7వ ర్యాంక్, తాళ్లూరి శ్రేయాస్‌రెడ్డి 8వ ర్యాంక్, సాధించారని వీటితోపాటు టాప్ 100లో 51ర్యాంకులు సాధించిన నారాయణ విద్యార్థులు ప్రత్యేకతను నిలబెట్టుకున్నారని వెల్లడించారు. ఇంజినీరింగ్‌లో 42ర్యాంక్‌లు, అగ్రిఫార్మా విభాగంలో 9ర్యాంకులు సాధించడంలో నారాయణ విద్యాప్రణాళిక కీలక పాత్ర పోషించినట్టు డైరెక్టర్లు పేర్కొన్నారు.