కఠినంగా లాక్డౌన్

- క్షేత్రస్థాయిలో సీనియర్ అధికారుల పర్యవేక్షణ
- పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశం
- గుర్తింపు కార్డులుంటేనే మీడియా, ప్రభుత్వోద్యోగులకు అనుమతి
- నిబంధనలు ఉల్లంఘించే వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు
హైదరాబాద్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేయాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ అమలుపై మంగళవారం ఆయన ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్లు, ఎస్పీల నుంచి డీఐజీ స్థాయి అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఏవిధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణాకు కూడా ఆంక్షలు లేవని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. వివాహాలకు ఇరువైపుల ను 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలని అన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని చెప్పారు. అదేవిధంగా, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని స్పష్టంచేశారు.
రెండో డోస్‌కు మాత్రమే అనుమతి
కరోనా వాక్సినేషన్‌కు వెళ్లాలనుకొనేవారిని వారి మొదటి డోస్‌కు సంబందించిన సమాచారం సెల్ఫోన్లో చూసి సడలింపు ఇవ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద తగు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ-పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులు జారీచేస్తారని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీజీపీతోపాటు శాంతి, భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

