DSC Notification | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి.
జిల్లాల వారీగా పోస్టులను పరిశీలిస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 176 ఉన్నాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 537 పోస్టులు ఉండగా, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఉన్నాయి.